నెలాఖరులోగా హాజీపూర్ వరుస హత్యలపై కోర్టు తీర్పు

Hajipur Murder Case Has Come To An End

హాజీపూర్‌ వరుస హత్యల కేసు విచారణ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ కేసుపై కొన్ని రోజులుగా నల్లగొండ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే గురువారం నిందితుడిని విచారించారు. వందమందికి పైగా సాక్షులు, అధికారులను విచారించిన కోర్టు, మరో రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి అనే సైకో కిల్లర్ మాయమాటలు చెప్పి చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడి ఆ తర్వాత హతమార్చిన విషయం అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే నేరస్తుడికి ఉరిశిక్ష వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వినిపించిన ఈ కేసులో విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా హాజీపూర్ వరుస హత్యల కేసుపై తీర్పును వెలువరించనుంది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

Hajipur Murder Case Has Come To An End,hajipur, srinivas reddy , nalgonda , fast track court, hearings, verdict,Hajipur serial rape-murders,#Hajipurrape and murder cases,ACP Bhongir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *