గవర్నర్లను టార్గెట్ చేసిన వీహెచ్ సంచలనం

hanamantha rao targeting governors

కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు  బండారు దత్తాత్రేయ నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.. అపొజిషన్ నేతలను చెడుగుడు ఆడతారనే పేరున్న వీహెచ్.. ఈసారి గవర్నర్లను టార్గెట్ చేశారు. తమను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్న నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. అది రాజకీయ వేదిక కానప్పటికీ ఆయన అలా మాట్లాడటం హాట్ టాపికైంది. తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు ముందు గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత గవర్నర్.. పాత గవర్నర్‌లా వ్యవహరించొద్దని సూచించారు. పనిలో పనిగా అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించిన దత్తన్నకు కూడా వీహెచ్ సుతిమెత్తగా చురకలు అంటించారు. ఫ్లెక్సీలో కాంగ్రెస్ నేతల ఫోటోలు ఎక్కడా కనబడటం లేదని ప్రశ్నించారు. అందరూ కలిసి చివరకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

tags :  telangana, governor, tamilasai soundara rajan, himachal pradesh, bandaru dattathreya, v, hanumatha rao, congress

రవిప్రకాష్ కు అక్టోబర్ 18వరకు రిమాండ్

ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *