విజయారెడ్డి సజీవదహనానికి ప్రభుత్వమే కారణం

151
hanumantha rao about vijaya reddy murder
hanumantha rao about vijaya reddy murder

hanumantha rao about vijaya reddy murder

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రాష్ట్రంలో పెను దుమారం రేపింది. తీవ్ర సంచలనం సృష్టించింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. విజయారెడ్డి హత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వ పొరబాట్లే కారణమని ఆరోపించారు. విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అని తెలిపారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం తెలంగాణలో విజయారెడ్డి అనే తహసీల్దార్ ను సురేశ్ అనే వ్యక్తి ఆమె కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం అన్ని వర్గాల వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం కేసీఆర్  రెవెన్యూ శాఖ విషయంలో ప్రవర్తించిన తీరు, అధికారులను కంట్రోల్ చెయ్యలేని ప్రభుత్వ విధానాలు వెరసి విజయారెడ్డి దారుణ హత్యకు కారణం అయ్యాయని వీహెచ్ ఆరోపణలు గుప్పించారు.

tags : vijayareddy, burnt alive case, accused, suresh, SIT, inquiry, land disputes, congress leader, v. hanumantha rao, cbi inquiry

మరింత విషమంగా సురేష్ పరిస్థితి 

https://tsnews.tv/balaya-clarity-on-mokshagna-entry/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here