హ్యాపీ బర్త్ డే బాస్

28
Happy Birthday Chiru
Happy Birthday Chiru
Happy Birthday Chiru
మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు. ఓ బ్రాండ్. స్వయంకృషి, హార్డ్ వర్క్ కి, డెడికేషన్ కు బ్రాండ్. ఏ కాలం యూత్ అయినా ఇన్సిస్పిరేషన్ గా తీసుకోవాల్సిన ప్రయాణం చిరంజీవిది. శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి.. ఆపై డేరింగ్ హీరో, సుప్రీమ్ స్టార్ నుంచి మెగాస్టార్ గా ఎదిగిన వైనం ఎన్ని తరాలైనా చెప్పుకునేంత గొప్పది. అందుకే అనేక మందికి ఆయన అన్నయ్య  అయ్యాడు. ఆ పేరును వెండితెరపై చూసి.. అతను హీరోగా ఎదిగిన తీరును చూసి ఎందరో కుర్రాళ్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటికే వారసత్వపు హీరోలు ఉన్నా.. అందరినీ కాదని ఆకట్టుకున్నాడు. అందరినీ మించి ఎదిగాడు. చిరంజీవి గురించి చెప్పాలంటే దాదాపు ఆయన నలభైయేళ్ల జీవితాన్ని చూడాలి. ఓ చిన్న ఊరిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి.. వెండితెర నటుడు కావాలన్న కలతో మద్రాస్ లో అడుగుపెట్టి.. ఫిల్మ్ స్కూల్ కంటే లైఫ్ స్కూల్ లో ఎక్కువగా నేర్చుకుని.. తన సినిమా జీవితానికి పునాదిరాళ్లు పడిన తర్వాత నటనంటే తనకు ప్రాణం ఖరీదు అని నిత్యం గుర్తుంచుకుంటూ ఒక్కో సినిమాతో ఎదిగాడు.
చిరంజీవి ఫస్ట్ ప్లస్ అతని కళ్లు. ఆ కళ్లు చూసే చాలామంది అప్పట్లో ఇతను ఎక్కడికో వెళతాడు అన్నారు. ఆ కళ్లు పలికించే భావాలకు అసలైన వేదిక రావడానికి కాస్త టైమ్ పట్టినా.. తర్వాత చెలరేగిపోయాడు. నలుగురులో ఒకడుగా నటించినా.. తనదైన ముద్రవేశాడు. అందుకే అతనికంటే బెటర్ యాక్టర్స్ అని ఫిల్మ్ స్కూల్ లో చెప్పుకున్నవాళ్లు కూడా ఆయనకు చాలా దూరంలో ఆగిపోయారు.  ఇక చిరంజీవిని యూత్ లో క్రేజీ స్టార్ గా చేసింది ఆయన డ్యాన్స్ లు. అప్పటి వరకూ చలిజ్వరం వచ్చినవాడిలా వణికుతున్నట్టుగా కనిపించిన డ్యాన్సులు చూసిన కుర్రాళ్లు చిరంజీవి వేసిన స్టెప్పులకు పిచ్చెత్తి పోయారు. చిరంజీవి డ్యాన్స్ లోని గ్రేస్.. ఇప్పటి వరకూ మరో ఇండియన్ యాక్టర్ లో లేదు అంటే అతిశయోక్తి కాదు. ఏ స్టెప్ నైనా తను ఓన్ చేసుకుంటాడు. ఇలా ఇంకెవరూ చేయలేరేమో అనేలా కష్టపడతాడు. ఇదే అతన్ని గ్రేట్ డ్యాన్సర్ గా గుర్తించేలా చేసింది.
అలాగే ఫైట్స్.. డూప్ లతో లాంగ్ షాట్స్ తో మొహం మొత్తిన తెలుగు ప్రేక్షకులకు సిసలైన ఫైట్స్ ఇలా చేస్తారు అని చూపించాడు. ఇక నటన గురించి వంకలు పెట్టడానికి లేదు. ఆలయ శిఖరం, విజేత, న్యాయం కావాలి, అభిలాష వంటి సినిమాల్లో అద్భుతమైన నటన చూపించాడు. అంతకు ముందు విలన్ గానూ మెప్పించాడు.  ఖైదీ.. తెలుగు సినిమా హిస్ట్రరీలో మాస్ కు హిస్టీరియా వచ్చేలా చేసిన సినిమా. ఈ సినిమాలోనూ చిరంజీవిలోని అద్భుత నటుడ్ని చూస్తాం. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఖైదీతో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీలా మారాడు. అటుపై తన దారిని పూలదారిగా చేసుకుని.. విజయకేతనం ఎగురవేస్తూ.. సుప్రీమ్ హీరోగా మారిన మెగాస్టార్ గా ఎదిగిన విధానం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
అది ఆయన కుటుంబానికీ విస్తరించి.. ఇప్పుడు మెగాస్టార్ అనే మర్చిచెట్టు నీడలో మరిన్ని స్టార్స్ పుట్టుకువచ్చాయి. 85ల నుంచి 90దశకంలో చిరంజీవి తెలుగు సినిమా బాక్సాఫీస్ పై విజయవిహారం చేశాడు. మని సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఓ రేంజ్ లో పెంచాడు. బిగ్గర్ దన్ బిగ్ బి అని నేషనల్ మీడియా కూడా పొగిడేలా చేసుకున్నాడు. హిట్లర్ నుంచి ఆయన ప్రస్థానం కొత్త టర్న్ తీసుకుంది. కానీ మధ్యలో వేటూరి చెప్పినట్టు ‘బృందావనం లాంటి సినిమా ఇండస్ట్రీని వదిలి కారడవి లాంటి పాలిటిక్స్’ లోకి వెళ్లాడు. పొలిటికల్ పార్టీతో కాస్త ఇబ్బంది పడినా.. మళ్లీ బృందావనానికే తిరిగి వచ్చాడు. ఖైదీ నెంబర్ 150, సైరా అంటూ మళ్లీ సత్తా చాటాడు. ప్రస్తుతం ఆచార్యగా రాబోతోన్న ఈ ఒన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ కు మనమూ బర్త్  డే విషెస్ చెబుదాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here