మాస్ స్టెప్పులతో రామ్ బర్త్ డే గిఫ్ట్

Happy birthday Ram

ఎనర్జిటిక్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్. ఇవాళ రామ్ బర్త్ డే. గత వారం రోజుల నుంచే అతని ఫ్యాన్స్ సందడి మొదలుపెట్టారు. కానీ ఎప్పటిలా గ్రాండ్ గా నిర్వహించుకునే ఛాన్స్ లేదు కాబట్టి..  సంబరాలు వద్దు అని ఫ్యాన్స్ కు ముందే రిక్వెస్ట్ పంపించాడు రామ్. అందుకే అభిమానులను ఖుషీ చేసేందుకు తన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ నుంచి ఓ వీడియో ప్రోమో సాంగ్ విడుదల చేశాడు. చూస్తోంటే ఇది సినిమాలో ఐటమ్ సాంగ్ లాంటిది అనిపిస్తోంది. సెక్సీ సైరన్ హెబ్బా పటలే నర్తించిన ఈ ఐటమ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. అయితే ఆ డ్యాన్స్ మూమెంట్స్ లో ఏ మాత్రం కొత్తదనం కనిపించకపోవడం విశేషం. అసలు రామ్ డ్యాన్స్ లో జానీ కనిపిస్తున్నాడు. పైగా ఆ స్టెప్పులన్నీ ఆల్రెడీ చాలా సినిమాల్లో వాడాడా అనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ లో కొంత నిరాశ కనిపించిందనే చెప్పాలి. మామూలుగా రామ్ సూపర్బ్ డ్యాన్సర్. ఎలాంటి మూమెంట్ అయినా సులువుగా చేస్తాడు. అలాంటి అతనితో ఇలా ఓల్డ్ అండ్ నాసిరకం డ్యాన్స్ చేయించడం జానీకి తగ్గట్టుగా లేదు.

పైగా ఈ పాటను రౌడీ అల్లుడులోని బోలో బోలో బోలోరాణి పాట ఇన్సిస్పిరేషన్ గా చేశాను అని చెప్పాడు జానీ. బట్ ఆ పాటను మ్యాచ్ చేయడం కాదు కదా.. మనిమం దగ్గరగా కూడా రాలేకపోయాడు. అలాగే మణిశర్మ ట్యూన్ కూడా ఏమంత కొత్తగా లేదు. ఇక రామ్ రెడ్ మూవీ ఈ మేలోనే విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా వెనకబడిపోయింది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడమ్ కు రీమేక్ గా వస్తోన్న  ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ డ్యూయొల్ రోల్ చేశాడు రామ్. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకుడు. మొత్తంగా కొన్నాళ్లుగా ఓటిటిలో విడుదలవుతుంది అని చెబుతున్నా.. రామ్ మాత్రం థియేటర్స్ లోనే అంటున్నాడు. ఇక ఈ బర్త్ డే తో రామ్ ఇండస్ట్రీకి వచ్చి 18యేళ్లవుతున్నాయి. ఇప్పటి వరకూ అతను తన కెరీర్ లో 17సినిమాలు చేశాడు. రెడ్ 18వది. వీటిలో ఆరు హిట్లున్నాయి. అయినా తనకంటూ ఓ క్రేజ్ ను నిలుపుకుని.. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ఇస్మార్ట్ శంకర్ ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటూ మన రీడర్స్ తరఫున పుట్టిన రోజు శుభకాంక్షలు చెబుదాం..

telugu cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *