ఎన్నికలు ఏవైనా గెలుపు టిఆర్ఎస్‌దే…

175
Harish Rao Best Wishes to KTR,KCR
Harish Rao Best Wishes to KTR,KCR

Harish Rao Best Wishes to KTR,KCR

తెలంగాణ మున్సిపల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. దాదాపు అన్ని మున్సిప‌ల్ ప‌రిధిలోనూ తెరాసా మెజారిటీ ఓట్ల‌తో ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ నేత‌లు, పార్టీ శ్రేణులు తెలంగాణ భ‌వ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. అధినేత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుకు శుభాకాంక్ష‌లు తెలిపేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. దీంతో అన్ని మున్సిప‌ల్ ఏరియాల‌లొ గులాబీ జెండా రెప‌రెప‌లాడుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భంజ‌నంపై స్పందించిన మంత్రి హ‌రీష్ రావు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. హ‌రీష్ రావు ట్వీట్ ఇలా ఉంది…

ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

Harish Rao Best Wishes to KTR,KCR,Telangana Municipal Elections,Municipal Elections Results,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here