ఇచ్చేది తెరాస ప్రభుత్వం… చెప్పుకునేది మాత్రం బీజేపీ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్ అంగన్ వాడీల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చిటికెడంతా ఉప్పువేసి…పప్పంతా నాదేనన్న తీరు బీజేపీదని దుయ్యబట్టారు. అంగన్ వాడీలకు కేంద్రం ఇచ్చేది రూ.2700/ మాత్రమేనని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ. 10,950 అని వెల్లడించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో అంగన్ వాడీ టీచర్ జీతం, మన రాష్ట్రంలో ఆయాలకిచ్చే మొత్తంతో సమానమని తేల్చి చెప్పారు. దేశంలో అంగన్ వాడీలకు అత్యధిక జీతాలు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. అంగన్ వాడీలలో ప్రతీ ఏటా పిల్లలు పెరుగు తున్నారు. వారి సంఖ్య దృష్ట్యా బడ్జెట్ పెరగాలి. కాని గత బడ్జెట్ లో కేంద్రం శిశు సంక్షేమ శాఖ కు 18 శాతం నిధులను కోత పెట్టిందన్నారు. గత బడ్జెట్ లో 29,540 కోట్లు కేటాయిస్తే, ఈ బ్డజెట్ లో కేంద్రం 24 వేల కోట్లకు తగ్గించిందని వెల్లడించారు.
బీజేపీ మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. గ్యాసి సిలిండర్ ధర రూ950/ కు పెంచడమే కాకుండా సబ్సిడీని 40 రూ తగ్గించింది. త్వరలో అది కూడా ఎత్తివేస్తుందన్నారు. గ్యాస్ ధరలు పెరగుదలకు రాష్ట్ర ప్రభుత్వం 350 రూ ట్యాక్స్ వేస్తున్నట్లు దుష్ప్రాచారం చేస్తోందని విమర్శించారు. గ్యాస్ పై జీఎస్టీ ఐదు శాతం మాత్రమే. అంటే 45 రూ. మాత్రమే. ఇందులో కేంద్రం జీఎసిటీ ఉంది. బీజేపీ కోతలు వాతలు వేస్తుంటే తెరాస. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పెన్షన్ 200 నుంచి 2016 కు పెంచాం.. కళ్యాణ లక్ష్మి పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి లక్ష నూటా పదహార్లు ఇస్తోందన్నారు.