హరీష్ రావ్.. అన్నీ అబద్దాలే..

145
harish rao is a Big Liar
harish rao is a Big Liar

హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని.. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని ఈటెల రాజేంద‌ర్ ఆరోపించారు. హుజూరాబాద్ లోని మధువని గార్డెన్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హ‌రీష్ రావు ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు. ‘‘హరీష్ నీకు సవాలు చేస్తున్న.. అభివృద్ది జరగలేదు, డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు, కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవ’ని అన్నారు. ‘‘నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నావు.. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్దమా.. నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా.. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు సిద్దామా ?’’ అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, ఎండల లక్ష్మీ నారాయణ, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here