హుజూర్ నగర్ ప్రచారానికి హరీష్?

Harish Rao for Huzoor Nagar by-election

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది . ఇక టిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది . టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా మంత్రి హరీష్ రావు ప్రచారం చేయనున్నారు. 17, 18 తేదీల్లో మంత్రి ప్రచారం చేసేందుకు ఇక రంగంలోకి దిగనున్నారు.గత ఎన్నికల ఫలితాల తర్వాత నుండి నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న మంత్రి హరీష్ రావు  తన నియోజకవర్గానికే పరిమిత అయ్యారు. తాజాగా ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు పార్టీ ప్రచారం కోసం హుజూర్ నగర్ వెళ్లనున్నారు . మంత్రి హరీశ్ రావు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని, పరిస్థితులన్నీ గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ అది అంత ఈజీ కాదని తాజా పరిణామాల నేపధ్యంలో అర్ధం అవుతుంది.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చటంతో హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందిగా మారింది.  18న ముఖ్యమంత్రి కేసీఆర్ తో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సమ్మె ప్రభావంతో సభకు సీఎం కేసీఆర్ వస్తారా రారా అనేది ఇంకా తేలలేదు . ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం టిఆర్ఎస్ పార్టీపై గట్టిగానే పడుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎదురీదాల్సి వస్తోంది. ఇక ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగుతుండడం ఒకింత ఇబ్బందికర పరిణామమే. అయినా ఆయన ప్రచారం చెయ్యనున్న నేపధ్యంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది.

tags : Huzoor Nagar , by-election ,Congress , trs , uttam kumar reddy, kcr,  harish rao ,Saidi Reddy,

http://tsnews.tv/chiranjeevi-couple-having-lunch-with-cm-jagan/
http://tsnews.tv/janasena-backs-telangana-bandh-on-19th/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *