Harish rao Reaction for not having Place on Minister List
రాజ్‌భవన్‌లో తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే.. కేసీఆర్ ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గ తొలి జాబితాలో ఎమ్మెల్యే హరీష్ రావు పేరు లేకపోవడంపై మీడియాలో భిన్న కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. హరీష్‌కు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారని కూడా ప్రచారం జరిగింది.
మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదన్న అసంతృప్తి తనకు లేదన్నారు హరీశ్‌రావు. తన పేరిట సేనలు కానీ తనకు గ్రూపులు కాని లేవని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ కేబినెట్‌ను విస్తరించారన్నారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్‌లో తాను క్రమశిక్షణగల కార్యకర్తనంటూ మరోసారి చెప్పిన హరీశ్‌రావు కేసీఆర్ ఏది ఆదేశిస్తే దాన్నే ఆచరిస్తానంటూ కుండబద్దలు కొట్టారు.ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
Check out here For More News
For More Interesting and offers