ఏకగ్రీవమై తొలిబోణీ కొట్టిన హరీష్ దత్తత గ్రామం

Harish Rao sensational Decision on Adopted Village

హరీష్ రావు దత్తత గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు రాజకీయాలు అవసరం లేదని సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకుంది. తమ నాయకుడు హరీష్ చేస్తున్న అభివృద్ధికి బహుమతిగా గ్రామ సర్పంచ్ ను ఏకగ్రీవం చేసి హరీష్ కు ఇచ్చింది ఇబ్రహీం పూర్ . తమ నాయకుడి పట్ల గ్రామ ప్రజల ప్రేమ , పార్టీ పట్ల హరీష్ నిబద్ధత ఈ పరిణామం తో అర్ధం అవుతుంది.
ఒక పక్క కేసీఆర్ హరీష్ రావు ను పక్కన పెట్టారు అని ప్రచారం జరుగుతున్నా, నిజంగానే కేసీఆర్ హరీష్ రావు కు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను హరీష్ రావు మరోసారి చూపించారు. పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టిన హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో తన మార్క్ చూపించారు.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే హరీష్ రావు, ఇప్పడు తెలంగాణా లో రానున్న పంచాయితీ ఎన్నికల్లో, తానూ దత్తత తీసుకున్న గ్రామంలో ఏకగ్రీవం జరిగింది. హరీష్ రావు తన సొంత ఇలాకాలో భోణి కొట్టారు… హరీష్‌రావు దత్తత తీసుకున్న గ్రామమైన ఇబ్రహీంపూర్‌ సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఇబ్రహీంపూర్‌ సర్పంచ్‌గా కోడూరు దేవయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు, వార్డు సభ్యులను కూడా ఏకగ్రీకవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన సర్పంచ్‌, వార్డు సభ్యులను అభినందించారు హరీష్‌రావు.

హరీష్ మార్క్ పాలనకు ఫిదా అయిన ఇబ్రహీంపూర్ గ్రామస్తులు ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం చేసి హరీష్ రావుకు బహుమానంగా ఇచ్చారు. టిఆర్ఎస్ అధినేత హరీష్ కు ప్రాధాన్యం ఇచ్చిన ఇవ్వకున్నా దత్తత గ్రామం గా ఇబ్రహీం పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసిన హరీష్ రావుకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అని మాత్రమే కాదు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేసి ఎన్నికల ఖర్చును తప్పించారు. గ్రామంలో రాజకీయాలకు చెక్ పెట్టారు. ఒక పక్క కేటీఆర్ సిరిసిల్లలో ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే 15 లక్షలు తన తరపున బహుమానంగా ఇస్తానని ప్రకటించినా ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. కానీ హరీష్ రావు ఏమి చెప్పకుండా ఆయన పాలనను మెచ్చుకుని ఇబ్రహీంపూర్ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం హరీష్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article