ఆర్టీసీ సమ్మె విషయంలో హరీష్ మౌనం

Harish silence on RTC strike

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా తనదైన పంథాలో నిర్ణయాలు తీసుకుంటూ పోయింది. కార్మికుల సమస్యలపై చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ కొత్తవారిని నియమించుకోవడానికి నోటిఫికేషన్ సైతం విడుదల చేస్తుంది. ఇక ఆర్టీసీ సమ్మె నేపద్యంలో ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అటు సమ్మెలో పాల్గొన్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఆవేదన చెందిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరైతే గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రి పాలయ్యారు. మరెన్నో ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఈ తరుణంలో మంగళవారం హైకోర్టు వ్యాఖ్యలు కార్మికులకు కాస్త ఊరటనిచ్చాయి. ‘సమ్మెను వెంటనే విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అటు ప్రభుత్వాన్ని కూడా మందలిస్తూ వ్యాఖ్యలు చేసింది.

ఇక ప్రభుత్వం అయితే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అటు ఆర్టీసీ జేఏసీ మాత్రం యాజమాన్యం, ప్రభుత్వం ఇద్దరిలో ఎవరు చర్చలకు పిలిచినా.. తాము వస్తామని.. ఆ తర్వాతే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు రెండు రోజుల క్రితం కేకే.. ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం చేయాలని అనుకున్నా కుదరలేదు. సీఎం కేసీఆర్ చర్చ విషయంలో సానుకూలంగా ఉంటే, ఆయన మాట్లాడమంటే తాను మాట్లాడతానని లేకుంటే లేదని కేశవరావు. యూ టర్న్ తీసుకున్నారు. అసలు కేశవరావు ఎందుకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పారు, ఆ తర్వాత ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. అసలు ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ తో కార్మికుల పక్షాన మాట్లాడతారు అని భావించిన హరీష్ రావ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న హరీష్ రావు, కార్మికుల సమస్యల గురించి సీఎం కేసీఆర్ తో మాట్లాడాల్సి ఉంది. అయినా ఆయన సైలెంట్ గా ఉండటం తో పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీసీ సమ్మె వెనుక ఆయనే ఉన్నాడని పలు విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంలో హరీష్ రావు ని ఇన్వాల్వ్ చేయడం అవసరం లేదని అన్నారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అయిన ఆర్టీసీ కార్మికుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.

tags : tsrtc, rtc strike, tsrtc strike, trs, cm kcr, harish rao, rtc jac, ashwatthama reddy

http://tsnews.tv/nagarjuna-sagar-is-a-danger-to-fish/
http://tsnews.tv/ayodhya-case-in-the-supreme-court/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *