మంత్రి హరీష్ రావు డ్రై డే..

HarishRao DryDay

మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ ఈ పనిని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అయితే, ఇదే కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో డ్రై డే అని  పేరు పెట్టారు. ఈ క్రమంలో సిద్ధిపేట పట్టణంలో డ్రై డేలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి రాకుండా చూడాలని ప్రజలకు మంత్రి సూచించారు. డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి. డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.

Telangana DryDay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *