ప్రశ్నించిన వాళ్ళ పట్ల బీజేపీ సర్కారు పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించాడు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతో కూడినవేనని అన్నారు. మహిళల హక్కుల కోసం 10వ తేదీన దీక్ష చేస్తున్నదనే ఉద్దేశ్యంతోనే నేడు ఈడీ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. విపక్షాలను రూపుమాపేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు తెచ్చుకోవాలని హితువు పలికారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్ పెంచండి గల్లీ గల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయండని విమర్శించారు. శవాలను కూడా విచారించే నియమాలను తేవాలని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం, కరెంటు, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ బిజెపి ప్రభుత్వానికి అవసరం లేదని దుయ్యబట్టారు.