హ్యాట్సాఫ్ హైద‌రాబాద్ రియాల్టీ ఇండస్ట్రీ

smr ramreddy

HATS OFF HYD REALTY

కరోనా ఉత్పాతం గురించి అర్థం చేసుకుని, తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించగానే రాష్ట్రానికి చెందిన నిర్మాణ రంగం అతివేగంగా స్పందించింది. కరోనాను కట్టడి చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించ‌డానికి అంద‌రికంటే ముందుగా స్పందించింది. క్రెడాయ్ హైద‌రాబాద్ సంఘం తొలుత కోటి రూపాయ‌ల విరాళాన్ని అంద‌జేసి మిగ‌తావారికి స్ఫూర్తిని క‌లిగించింది.  క్రెడాయ్ హైద‌రాబాద్ స్పందించాకే, రాష్ట్రంలోని ఇతర సంఘాలు ముందుకొచ్చాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.  కొందరు డెవలపర్లు వ్యక్తిగతంగా తమ వంతు సహాయ సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. వంశీరామ్‌ బిల్డర్స్, అప‌ర్ణా గ్రూప్‌, సాకేత్ ఇంజినీర్స్‌, సుమ‌ధుర‌, వాస‌వీ, శాంతాశ్రీరాం క‌న్ స్ట్ర‌క్ష‌న్స్‌, శ‌తాబ్ది టౌన్ షిప్స్, ఆదిత్యా హోమ్స్ త‌ద‌త‌ర సంస్థ‌లు త‌మ వంతు స‌హాకారాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంద‌జేశాయి. ట్రెడా సంఘం హైద‌రాబాద్‌లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా భోజ‌నాన్ని స‌మ‌కూర్చ‌డంలో త‌మ వంతు స‌హ‌కారాన్ని అంద‌జేసింది. రాష్ట్రానికి చెందిన మ‌రో నిర్మాణ సంఘం, రియ‌ల్ కంపెనీలు అతిత్వ‌ర‌లో త‌మ వంతు స‌హ‌కారాన్ని ప్ర‌క‌టించ‌డానికి సంసిద్ధంగా ఉన్నాయి.

* భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు ఎలాంటి కొర‌త రానీయ‌కూడ‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీతో బాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌లుసార్లు కోరారు. అయితే, అంత‌కంటే ముందు హైద‌రాబాద్ నిర్మాణ సంస్థ‌లు స్పందించాయి. అస‌లెవ‌రూ చెప్ప‌క ముందే, త‌మ ప్రాజెక్టుల్లో ప‌ని చేసే భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు అండ‌గా నిలిచాయి. తొలుత వారికి కావాల్సిన సొమ్మును స‌మ‌కూర్చాయి. ప్ర‌తిఒక్క‌రికీ క‌డుపు నిండా భోజ‌నాన్ని అందించే ప్ర‌క్రియకు శ్రీకారం చుట్టాయి. ఇలా, దాదాపు వంద‌కు పైగా నిర్మాణ సంస్థ‌లు వ‌ల‌స కార్మికుల‌కు భోజ‌న స‌దుపాయాన్ని నిర్విరామంగా అంద‌జేస్తున్నాయి. ఒక‌వైపు అమ్మ‌కాలు లేక‌పోయినా, నిర్మాణ ప‌నులు జ‌ర‌గ‌కున్నా, మార్కెట్ మొత్తం కుప్ప‌కూలినా, నిర్మాణ సంస్థ‌లు మాత్రం త‌మ‌ను న‌మ్మిన సిబ్బంది, నిర్మాణ కార్మికుల్లో వెలుగురేఖ‌ల్ని నింపుతున్నాయి. ప్ర‌ణీత్ గ్రూప్ వంటి సంస్థ అయితే, ఏకంగా తమ సైట్ల‌లో ప‌ని చేసే నిర్మాణ కార్మికుల‌కు చికెన్ భోజ‌నాన్ని కూడా పెడుతున్నాయి.

HYDERABAD REALTY UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article