వైద్యం వికటించి బాలింత మృతి

వైద్యం వికటించి బాలింత మృతి
ఠాగూర్ సినిమా మళ్లీ రిపీట్

రాజమహేంద్రవరం : వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గోకవరం మండలం, ఎం. మల్లవరం గ్రామానికి చెందిన అరుణ ( 21 ) మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో రాజమహేంద్రవరం మాగ్నా తల్లి పిల్ల హాస్పిటల్ కు చిన్న ఆపరేషన్ ( ఫ్యామిలీ ప్లానింగ్ ) చేసుకునేందుకు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది ఐ. సి. యు వార్డులోకి ఆపరేషన్ చేసేందుకు వైద్య సిబ్బంది తీసుకువెళ్లారు. ఆపరేషన్ అనంతరం మహిళలు బయటకు తీసుకు వచ్చారు. అరుణతో ఆపరేషన్ చేయించుకున్న ఇద్దరు మహిళలు మేల్కొని వారి బంధువులతో మాట్లాడుతుండగా అరుణ ఆపరేషన్ చేసినప్పటికీ ఎంతకీ మత్తు నుంచి ఎంతకీ మేల్కోకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి ఆసుపత్రి సిబ్బంది కి తెలియజేశారు. మత్తులో ఉంది కొద్దిసేపటికి మేల్కోంటుందని ఆసుపత్రి సిబ్బంది బంధువులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ అరుణ మేలుకో కాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది గట్టిగా నిలదీశారు.వైద్య సిబ్బంది అరుణ భర్త బంధువులకు తెలియకుండా అంబులెన్స్ లో డెల్టా హాస్పిటల్ కు తరలించి అక్కడ అరగంట ఐసియు లో ఉంచి అనంతరం మృతి చెందిందని నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి తీసుకుపోలని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న మహిళను తీసుకువచ్చి చిన్న ఆపరేషన్ నిమిత్తం చేర్చిన తమకు మృతదేహం అప్పగించారంటూ మృతురాలి భర్త, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హాస్పిటల్ లో మృతదేహంతో బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article