బ్ర‌హ్మానందంకు హార్ట్ స‌ర్జ‌రీ…

Heart Attack for Bramanadam
వెయ్యికి పైగా సినిమాల్లో అత్య‌ధి శాతం తెలుగు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా త‌న‌దైన శైలిని క్రియేట్ చేసిన బ్ర‌హ్మానందం ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. రీసెంట్‌గా ముంబై వెళ్లిన ఆయ‌న  ఆదివారం ఉన్న‌ట్లుండి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌లోని ఏషియ‌న్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు వెంట‌నే హార్ట్ ఆప‌రేష‌న్ చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకుని సోమ‌వారంనాడు ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. బ్ర‌హ్మానందం త‌ర్వ‌గా కోలుకోవాల‌ని అభిమానులు, శ్రేయోభిలాషులు సోష‌ల్ మీడియా వేదిక‌గా మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article