గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామం లో భారీగా గంజాయి పట్టివేత

గుంటూరు జిల్లా చేబ్రోలు గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామం బండ వారి పాలెం లో చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధి లో విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారుగా ఆరు కేజీల గంజాయి పట్టుబడింది. వివరాలను తెనాలి సబ్ డివిజన్ డి.ఎస్.పి స్రవంతి రాయ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధి లో గురువారం రాత్రి 10 సమయములో పొన్నూరు టౌన్ సీఐ శ్రీ శరత్ బాబు మరియు చేబ్రోలు ఎస్ఐ వై.సత్యనారాయణ రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బంది తో కలిసి చేబ్రోలు గ్రామములొని బండ్ల బజార్ వద్ద కమదుల వెంకట రావు ఇంటి లో గంజాయి రవాణా చేస్తున్న దిగుడు వీరాంజనేయులు (వయసు 31 సం )ను రైడ్ చేసి , నిందితుదిని పట్టుకొని , అతని వద్ద నుండి 3 ప్యాకెట్ల లో సుమారు 6 KG లు గంజాయి ని పట్టుకొని , అరెస్టు చేసి కేసు నమోదు చేశారు .
ముద్దాయి దిగుడు వీరాంజనేయులు మరియు కమదుల వెంకట రావు ఇద్దరు కలిసి నర్సిపట్నం కు దగ్గర్లో ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియా లో గంజాయి ని కొనుక్కొని , గోతములో ప్యాక్ చేసుకొని,చేబ్రోలు గ్రామానికి తీసుకోని వచ్చి గంజాయిని చిన్న చిన్న పొట్లలు గా కట్టి వాటిని చేబ్రోలు మండలం లోని కావలసిన వాళ్ళకి అమ్ముతుంటారు . వీరిలో కమదుల వెంకట రావు S / o కోటేశ్వర రావు ,(వయసు 52 సం.లు )బండ్ల బజార్ , చేబ్రోలు గ్రామము. ప్రస్తుతానికి కమదుల వెంకటరావు పరారీలో ఉన్నాడు . పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు .
ఈ కేసులో ప్రతిభ కనపరిచిన చేబ్రోలు ఎస్. హెచ్.ఓ సత్య నారాయణ , ఎస్.ఐ కోటేశ్వర రావు, మరియు వారి సిబ్బంది కానిస్టేబుళ్లు అప్పల నాయుడు , ధర్మరాజు , కిరణ్ , నాగరాజు , శివకృష్ణ లను తెనాలి సబ్ డివిజన్ DSP శ్రీమతి స్రవంతి రాయ్ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article