ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ ..తెలంగాణలో వర్షాలు

101
Heavy Rain Alert For Next 2 Days In Telangana
Heavy Rain Alert For Next 2 Days In Telangana

Heavy Rain Alert For Next 2 Days In Telangana

శీతాకాలంలో వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజుల నుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. విపరీతమైన చలితో పాటు చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో.. తెలంగాణలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయని సమాచారం .శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా కరీనంగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్‌లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రానున్న  రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Heavy Rain Alert For Next 2 Days In Telangana,winter season, rains 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here