హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, హైటెక్ సిటీ, సనత్‌నగర్, బోరబండ, మాదాపూర్, బాలాపూర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, సరూర్‌నగర్‌తో పాటు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాగా వర్షం హైదరాబాద్ నగరమంతా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.