రానున్న రెండు రోజుల్లో తుపాన్ ప్రభావంతో హైదరాబాద్‌లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం హై అలర్ట్ ప్రకటించింది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండి అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.