అధికారుల్ని అప్రమత్తం చేసిన హరిశ్ రావు

50

భారీ వర్షాల వల్ల దృష్ట్యా జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ లు క్షేత్ర పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేయాలని హరీష్ రావు అప్రమత్తం చేశారు. గులాబ్ తూఫాన్ నేపథ్యంలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల యంత్రాంగంను అలర్ట్ ఉండాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు హెడ్ క్వార్టర్ లోనే ఉండాలన్నారు. జిల్లాల్లోని చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల్లో నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ, ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని ఆదేశించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.

  • శిథిలావస్థ భవనాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేపించి తాత్కాలిక వసతి కల్పించాలన్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, మనుషులు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. సమస్యలపై కంట్రోల్ రూం కు వచ్చే సమస్యల పై తక్షణమే స్పందించాలని తెలిపారు. పూర్తిగా ఇండ్లు ధ్వంసం అయిన వారికి ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక సహాయం వెంటనే అందేలా చూడాలని చెప్పారు. బాధితులకు రేషన్ బియ్యం అందజేయాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here