మూడు రోజుల్లో భారీ వర్షం

34
Heavy Rains Next 3 Days
Heavy Rains Next 3 Days

Heavy Rains Next 3 Days

మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 కీ. మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ ద్రోణి అ. 14.0° ఉ వెంబడి పెనిన్సులర్ భారతదేశం మరియు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 కీ. మీ నుంచి 5.8 కీ. మీ ఎత్తు మధ్య ఏర్పడింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కీ. మీ ఎత్తు వరకు కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారింది.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడురోజులు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Heavy Rains

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here