రైతుల సాయం ఓకే

Helping farmers ok, what about leased farmers  .. కౌలు రైతుల మాటేమిటి ?

ఎన్నికల సమయంలో రైతుల మీద ప్రేమ కురిపిస్తూ వరాల జల్లులు కురుస్తున్నాయి అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రైతుల మీద చూపిస్తున్న ప్రేమ ఇసుమంతయినా కౌలు రైతుల మీద చూపించడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రైతన్నలమే .. కాస్త కూడా భూమిలేని వ్యవసాయం మీద ఆధారపడిన కౌలు రైతన్నలము అంటూ ప్రభుత్వాన్ని పెట్టుబడి సాయం కోసం అర్ధిస్తున్నారు.

రైతే రాజు అని ప్రభుత్వాలు రైతుకు పెద్దపీట వేస్తున్నాయి. తెలంగాణ కర్షకులకు పెట్టుబడి సాయంలో ఎక్కువ లబ్ది చేకూరబోతోంది. ఎన్నికల సందర్భంగా ఇటు రాష్ట్రం అటు కేంద్రం వ్యవసాయానికి తాయిలాలు ప్రకటించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎకరానికి 8వేలు ఉన్న రైతుపెట్టుబడి సాయాన్ని 10వేలకు పెంచింది.తాజాగా కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏడాదికి 6వేలు ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏడాదికి 6వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మొత్తం కలిపి ఏడాదికి 16వేలు పెట్టుబడి సాయం కింద అందనుంది. 5ఎకరాలు ఉన్న రైతుకు సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి 50వేలు, కేంద్ర సాయం 6వేలు కలిపి మొత్తం 56వేల రూపాయలు అందనున్నాయి.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం వల్ల రాష్ట్రంలో 47 లక్షల 8వేల మంది రైతులు లబ్ది పొందుతారు. ఒక విడతలో 2వేల చొప్పున రాష్ట్ర రైతులకు 941 కోట్ల 53 లక్షలు అందుతాయి. ఏడాదికి 6వేల చొప్పున రాష్ట్ర రైతులకు 2, 824కోట్ల 59లక్షల సాయం రానుంది. రైతు బంధు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఏటా రైతులకు దాదాపు 12వేల కోట్లు చెల్లించనుంది.
ప్రస్తుత రబీ సీజన్ కు అంటే గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. అయితే ఈ ఏడాది మార్చి నాటికి రైతులకు డబ్బు జమ అవుతుందని భావిస్తున్నారు. అందుకు అవసరమైన రైతు బ్యాంకు ఖాతా నంబర్లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి.రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద అన్ని వర్గాలు పెట్టుబడి సాయం పొందుతుండగా మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకంతో ఇప్పుడున్న సన్న,చిన్నకారు రైతులకే అదనంగా కేంద్ర సాయం అందనుంది. అయితే కౌలు రైతుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. కౌలురైతులకు సాయం అందించే విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article