సైరా అంటున్న విజ‌య్ సేతుప‌తి లుక్‌

Here is the first look poster & Motion poster of Vijay Sethupathi from Megastar Chiranjeevi’s ‘Sye Raa’. Directed Surender Reddy & Producer by Ram Charan.
మెగాస్టార్ ప్రెస్టీజియ‌స్ మూవీ `సైరా న‌ర‌సింహా రెడ్డి` శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఉయ్యాల‌వాడకు స‌హ‌కారం అందించిన రాజా పాండి అనే పాత్ర‌లో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆయ‌న లుక్‌ను విడుద‌ల చేసింది. సైరా సినిమాను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి రాంచ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్ల న‌టిస్తున్నారు. ఈ ఏడాది ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article