సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఇంట తర్వలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. వివరాల్లోకెళ్తే వెంకటేష్ పెద్దకుమార్తెను హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ టి.సురేందర్ రెడ్డి మనవడికిచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఆశ్రితకు కాబోయే వరుడుకి మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. వెంకటేష్ ఇంట్లో రీసెంట్‌గా పరిమిత సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. మార్చి 1న వీరి వివాహం జరగనుంది. అయితే పెళ్లి వేదిక ఎక్కడనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో జరగనుందని టాక్. వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత బేకర్స్ కు సంబంధించిన ప్రత్యేకమైన కోర్సు చదివి నగరంలో అక్కడక్కడా అవుట్ లేట్స్ తెరిచింది.
వెంకీ కూతురు పెళ్లి ఎప్పుడంటే?
