Heritage Reacts Ove Minister Buggana Comments
ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపణలపై హెరిటేజ్ సంస్థ యజమాని ఎం.సాంబశివరావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బుగ్గన మాట్లాడుతూ.. ఆంధ్ర రాజధాని అమరావతి నిర్ణయించి ఆ ప్రాంత చుట్టుప్రక్కల భూములన్నీ చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారని, అక్కడ రాజధాని నిర్ణయించకముందే చంద్రబాబు ఆ ప్రాంతం చుట్టుకుప్రక్కల భూములను తన బినామీలతో కొనిపించారని బుగ్గన ఆరోపించారు. ఈ మేరకు ఈ చర్చ రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా హెరిటేజ్ సంస్థ అధ్యక్షుడు ఎం.సాంబశివరావు స్పందించాడు.
రాజధాని పరిసర ప్రాంతంలో మేము భూములు కొన్న మాట వాస్తవమేనని, అయితే అమరావతికి 20కిలోమీటర్ల దూరంలో మేము ల్యాండ్ కొన్నామన్నారు. అయితే రాజధాని ఎక్కడో తెలియకముందే కొనుగోలు చేశామన్నారు. ఇక మేము కొనుగోలు చేసే సమయానికి ఎన్నికలు జరుగుతున్నట్లు, అసలు ఎవరు గెలుస్తారో తెలియకముందే కొనుగోలు చేశామన్నారు. అక్కడ భూములను కొనుగోలు చేసింది కేవలం వ్యాపార విస్తరణలో భాగంగానే అని చెప్పారు. ఇక మేం కొన్న 14 ఎకరాల్లో నాలుగున్నర ఎకరాల విషయంలో కొంత వివాదం వచ్చింది. మేం ఎల్ఇపీఎల్ సంస్థ నుంచి కొనుగోలు చేశాం. కొందరు వ్యక్తులు దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం ఉన్నట్లు గుర్తించి ఆ కొనుగోలును రద్దు చేసుకున్నాం అని హెరిటేజ్ సంస్థ యజమాని ఎం.సాంబశివరావు వివరించారు