Crazy hero on dual Language movie
హీరోగా కెరీర్ ఫ్రారంభమైన తొలి నాళ్లలోనే అర్జున్‌రెడ్డితో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ హీరో భరత్ కమ్మ దర్శకత్వంలో `డియర్ కామ్రేడ్` సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత ఓ బైలింగ్వువల్ సినిమా చేయబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఇది వరకు తెలుగు, తమిళంలో `నోటా` అనే బైలింగ్వువల్ సినిమా చేసిన ఈ కుర్ర హీరోకి ఆ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. కాగా ఇప్పుడు ఓ డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి తెలుగు, తమిళంలో సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అవుతుందని సమాచారం.