ఆందోళనకరంగా రాజశేఖర్ ఆరోగ్యం

Hero rajashekar fight with corona

కరోనా సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే ఎంతోమంతి  ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు కోలుకుంటే, మరికొందరు చనిపోయారు. తాజాగా సీని నటుడు రాజశేఖర్ కుటంబం కూడా కరోనా బారిన పడింది. కుటుంబ సభ్యులంతా కోలుకున్నప్పటికీ, రాజశేఖర్ పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికిపై రాజశేఖర్ కూతురు శివాత్మిక స్పందించింది. ట్విటర్ ద్వారా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిని తెలిపింది. ‘ కోవిడ్ తో నాన్నఫైట్ చేస్తున్నాడు. కష్టంగా ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా ఉన్నారు. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయండి. మీ ప్రేమ, మద్దతుతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నా’ అంటూ ట్విట్ చేసింది శివాత్మిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *