స‌రిహ‌ద్దులో త‌నీష్‌కి పనేంటి?

Hero Tanish Border ?
గ‌త ఏడాది వి.కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ `రంగు` సినిమాతో న‌టుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న హీరో త‌నీష్ ఇప్పుడు మ‌ళ్లీ అదే డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. త‌నీష్ న‌టిస్తోన్న తొలి ద్విభాషా చిత్ర‌మిది. ఈ చిత్రానికి స‌రిహ‌ద్దు అనే టైటిల్ పెట్టారు. టైటిల్‌, పోస్ట‌ర్‌ను బ‌ట్టి చూస్తే జాతీయ క‌థాంశంతో రూపొందుతోన్న చిత్రంగా అర్థ‌మ‌వుతుంది. ఈ మార్చి 16 నుండి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. సినిమాకు సంబంధించిన మిగ‌తా నటీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article