జమ్ములో ఉద్రిక్తత

Hi tension in Jammu – ఎదురు కాల్పుల్లో ఒక మేజర్ , ముగ్గురు జవాన్ల మృతిజమ్మూకశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. ఫిబ్రవరి-18-2019 న పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మేజర్, ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఓ స్థానికుడు మృతి చెందాడు. టెర్రరిస్టులు చొరబడ్డారనే సమాచారంతో ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. బలగాలు దీటుగానే ఎదుర్కొన్నా… 8 గంటలకు పైగా సాగిన కాల్పుల్లో ఓ మేజర్.. ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. పింగలాన్ ప్రాంతానికి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి.
2019, ఫిబ్రవరి 14వ తేదీ పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెద్ద సంఖ్యలో జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాక్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి టెర్రరిస్టులను మట్టుబెడతామని అంటున్నారు. అటు పుల్వామాలో ఉగ్రవాదుల ఏరివేతకు బలగాలు రంగంలోకి దిగాయి. ఊహించని రీతిలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు వీర మరణం చెందడం విషాదం నింపింది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article