High command Survey results … ఉత్తమ్ బర్తరఫ్ కు డిమాండ్
పార్టీ నేతలపై అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో అలాగే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని, కుంతియా ను మల్కాజ్ గిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో దూషించిన కారణంగా సర్వే సత్యనారాయణ పై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ లోని సీనియర్ నేత అయిన సర్వే సత్యనారాయణ ఈ వ్యవహారంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ని ఆశ్రయించారు.
ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ని బర్తరఫ్ చేసి తీరాలని సర్వే సత్యనారాయణ అధిష్టానం ముందు పెట్టారు .
పార్టీ నుంచి తనను సస్పెండ్ చెయ్యడాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చెయ్యడంపై గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనిని కలిసి సస్పెండ్ అంశంపై వివరణ ఇచ్చారు.
అయితే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ తనను సస్పెండ్ చేశారని చెప్తే ఆశ్యర్యం వ్యక్తం చేసిందని సర్వే సత్యనారాయణ మీడియాకు స్పష్టం చేశారు. నిన్ను సస్పెండ్ చేయడమేంటని ఆంటోని అడిగినట్లు చెప్పుకొచ్చారు. డోంట్ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నారని తెలిపారు.
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాపై విరుచుకుపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు.
తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్ చేయాలని సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. తాను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని అలాంటిది తననే సస్పెండ్ చేస్తారా అంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే సత్యనారాయణల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.