ఏపీ ఉన్నత విద్యా కమిషన్‌ పై హైకోర్టు ఆగ్రహం

85

అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో చట్ట నిబంధనలు పాటించక పోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వ్యక్తి గతంగా కానీ, నేరుగా కానీ కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమీషన్ సిఫార్సు చట్ట ఉల్లంఘనే అని పేర్కొంది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు ఖరారు చేస్తూ జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరి 8న జీవో నెంబర్ 1ని విడుదల చేసింది.

ముందస్తుగా కళాశాలకు సమాచారం ఇవ్వకపోవడంతో హైకోర్టును శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల కళాశాలలు ఆశ్రయించాయి. జోవో నెం 1 ను కొట్టి వేస్తూ కళాశాలలకు ముందస్తు సమాచారం ఇచ్చి వారితో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తాత్కాలిక రుసుములే విద్యార్థుల నుండి వసూలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here