కూల్చివేతపై హై కోర్టు నిర్ణయం

High Court Decision KCR Shock

ఎర్రమంజిల్ వద్ద ఉన్న భవనాలు, తెలంగాణ సచివాలయ భవనాలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూల్చివేయకూడదని హైకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్టయ్యింది. సచివాలయ భవనం, ఎర్రమంజిల్ వద్ద భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు గత నెల 27న కొత్త భవనాల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఇక ఈ నిర్మాణాలు అవసరం లేదని, ప్రజా దానం దుర్వినియోగం అని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ సచివాయలం, అసెంబ్లీలకు కొత్త భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించటం కేవలం వాస్తు కోసమేనని, కేసీఆర్ మూఢ నమ్మకాల వల్లే అని ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చివేయడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ తరుణంలో సోమవారం నాడు దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణ చేసింది. అయితే ఈ విచారణ సమయంలో కౌంటర్ కోసం గడువు కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు ఆ తర్వాత నేరుగా వాదనలు విన్పిస్తామని ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 2:15 గంటలనుండి విచారణ మరోమారు కొనసాగుతుంది.అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎర్రమంజిల్ వద్ద ఉన్న భవనాలు, తెలంగాణ సచివాలయం భవనాలను కూల్చివేయవద్దని డ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article