టీడీపీ ఎంపీ గల్లా తో పాటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన హైకోర్టు

129
MP GallaJayadev About 3 Capitals
MP GallaJayadev About 3 Capitals
High Court gave shock to tdp mp Galla Jayadev 

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాకిచ్చింది.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు రామానాయుడు గద్దె రామ్మోహన్ రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ పిటీషన్ తోపాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు నోటీసులు జారీ చేసింది.
గల్లా జయదేవ్ ఎన్నికను సవాలు చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో  కేవలం 4200 ఓట్ల మెజారిటీతోనే గల్లా విజయం సాధించాడు. 9వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రిజెక్ట్ చేయడం దుమారం రేపింది. పోస్టల్ బ్యాలెట్లతో గెలిచేవాడినని మోదుగుల కలెక్టర్ ను కోరినా పట్టించుకోలేదు. దీంతో ఇందులో పెద్ద గోల్ మాల్ జరిగిందని వైసీపీ అభ్యర్థి మోదుగుల హైకోర్టును ఆశ్రయించాడు.ఇక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి సత్యనారాయణమూర్తి హైకోర్టును ఆశ్రయించాడు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి హైకోర్టుకెక్కారు. వీటిపై విచారించిన కోర్టు గల్లా జయదేవ్ తో సహా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.  దీంతో వీరి ఎన్నిక చెల్లుతుందా లేదా అన్న టెన్షన్ టీడీపీ నేతలను పట్టుకుంది.
tags :highcourt, notices, guntur mp , Galla Jayadev , tdp,Vijayawada East MLA, Gadde Rammohan Rao,palakollu mla, nimala  Ramanayudu

మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు

హుజూర్ నగర్ లో నేడు సీఎం కృతజ్ఞత సభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here