తెలంగాణా హైకోర్టు నిర్ణయమేమిటి?

HIGH COURT INSTRUCTIONS

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 15వరకు లాక్ డౌన్ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇక మోదీ ప్రకటించిన ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ న్యాయవ్యవస్థ లాక్ డౌన్ ను ఏప్రిల్ 14వరకు పొడిగించారు. రాష్ట్రంలో కోర్టులన్నీ ఏప్రిల్‌ 14 లేదా తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ లాక్‌డౌన్‌లో ఉంటాయని హైకోర్టు ప్రకటించింది. న్యాయశాఖ ఉద్యోగులు ఇళ్లల్లోనే అందుబాటులో ఉండాలని, అత్యవసర అంశాల కోసం న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్‌లు రోటేషన్‌పై విధుల్లో ఉండాలన్న విషయాన్ని  ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. రిమాండ్‌, బెయిల్‌ కేసులకు సంబంధించిన విచారణలను వీడియో కాన్ఫరెన్స్‌ లేదా స్కైప్‌ ద్వారా చేపట్టాలని.. అలాగే అత్యవసర పిటిషన్లను ఈ-మెయిల్‌ ద్వారా దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక అంతే కాదు ఇప్పటి వరకు ఉన్న స్టే లను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. న్యాయవాదులంతా లాక్ డౌన్ తప్పని సరిగా పాటించాలని కోర్టు పేర్కొంది.

tags: telangana high court legal services, rotation, emergency,#COVID 19 LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *