టీడీపీ ఆఫీసు నిర్మాణంపై హైకోర్టు నోటీసులు

880
High Court
High Court

High Court issues notice to newly constructed TDP office

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన నూతన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ఇటీవలే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు .మంగళగిరిలో ఇటీవల ప్రారంభించిన టీడీపీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన సమస్యలు వచ్చిపడ్డాయి. మంగళగిరిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ కార్యాలయం నిర్మించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి, కలెక్టర్‌, టీడీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలోనే ఎక్కువ రోజులు ఉంటున్న టీడీపీ అధినేత..తమ పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకు గుంటూరులోని పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంగా వినియోగించారు. అయితే, ఈ నిర్మాణం కోసం స్థలం ఖరారు చేసిన సమయం నుండి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ స్థలం ఆక్రమించినదంటూ అప్పట్లోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేసారు. అయినా వెనక్కి తగ్గని టీడీపీ ఈ భవంతిని నిర్మించింది. ఇప్పుడు ఈ భవన నిర్మాణంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిటీషన్ పై విచారణ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here