టీఎస్పీఎస్సీని మూసేయండి

72


  • హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే దాన్ని మూసేయాలనే ఉద్దేశం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వచ్చే నాలుగు వారల్లోపు ఛైర్మన్, సభ్యులను నియమించాలని, ఇందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని తెలియజేసింది. ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పూర్తిస్థాయి కమిషన్‌ను నియమించనున్నట్లు హైకోర్టుకు స్పష్టం చేశారు.

నిరుద్యోగి శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే సభ్యులుగా ఉన్నారని, నిరుద్యోగులు ఎంతగానో కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, పూర్తిస్థాయి కమిషన్ లేకపోవడంతో గొప్పగా పని జరగడం లేదని, ఛైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగేలా హైకోర్టు చొరవ తీసుకోవాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు, కమిషన్‌లో ఒక్కరు మాత్రమే ఉండటం ఏమిటని నిలదీసింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను ముగించి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here