చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం

95

నిర్మల్ లో చెరువుల్లో అక్రమణాల్ని తొలగించకపోవడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర, మున్సిపల్ కమిషనర్ విచారణకు హాజరయ్యారు. కబ్జాలు తొలగించాలని ఆదేశించి ఆరు నెలలైనా ఎందుకు అమలు చేయలేదని హై కోర్టు సీరియస్ అయ్యింది. ఐదు చెరువుల్లో ఆక్రమణలను 80 శాతం తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. మిగతా ఆక్రమణలు తొలగించేందుకు నెల రోజులు గడువు కోరారు. కరోనా తీవ్రత, భైంసా అల్లర్లు తదితర కారణాల వల్ల పూర్తి చేయలేక పోయామన్నారు. చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

చెరువుల పరిరక్షణ కమిటీలను కొనసాగించాలని హైకోర్టు కలెక్టర్ కు ఆదేశించారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు.. మళ్లీ కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద కాలువల ఆక్రమణలు తొలగించి.. చెరువులకు కలపాలని ఆదేశించారు. పూర్తి స్థాయి బ్లూప్రింట్ సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. తదుపరి విచారణ విచారణ జులై 29కి వాయిదా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here