మిస్సింగ్ కేసులో డీజీపీకి హైకోర్టు షాక్…

high court shocks ap dgp

ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ గౌతమ్ సావంగ్‌కు అమరావతి హైకోర్టు షాకిచ్చింది. ఫిబ్రవరి 14న హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. రెండ్రోజుల గడువుతో హైకోర్టుకు హాజరు కావాలని నిర్దేశించింది.ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు. విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

high court shocks ap dgp,dgp , goutham sawang , high court, uttarandhra , two members , missing case,telugu latest news,2 missing case,ap political news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article