సీఎం పైనే హైకోర్టులో ఓటరు పిటీషన్

High Court Voter Petition on CM   .. కేసీఆర్ ఎన్నిక చెల్లదు

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలిచినా వారి ఎన్నిక చెల్లదని కోర్టులో పిటీషన్లు దాఖలు అవుతున్నాయి. అయితే ఏకంగా సీఎం కేసీఆర్ పైనే పిటీషన్ దాఖలు చేశారు ఓ ఓటరు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గజ్వేల్‌ ఓటరు శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలైంది.కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు ఉంటే 2 మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారన్న శ్రీనివాస్‌ తప్పుడు సమాచారమిచ్చిన కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్ధులు వరుసగా హైకోర్టు తలుపు తడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదంటూ కోర్టును ఆశ్రయించారు. తమపై గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. పది మందికి పైగా కాంగ్రెస్‌ నేతలు పిటిషన్లు దాఖలు చేయడంతో వాటన్నింటినీ సోమవారం విచారణ చేపట్టనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article