హైద‌రాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

*గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యుల విశ్లేష‌ణ‌
*వ‌ర్షాకాలం, పారిశుధ్య లోపంతో వైర‌ల్ జ్వ‌రాల తీవ్ర‌త‌

హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని న‌గ‌రంలోని ప్ర‌ముఖ మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రి అయిన లక్డీకాపుల్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. దోమ‌కాటు వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది. ఒక్కోసారి దాని ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉండి, చివ‌ర‌కు మ‌ర‌ణం కూడా సంభ‌విస్తుంది. కొన్ని సాధార‌ణ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే డెంగ్యూ కార‌క దోమ‌ల నుంచి ప్ర‌జ‌లు ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు.

కేసుల సంఖ్య పెర‌గ‌డంపై గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ నిపుణుడు డాక్ట‌ర్ వై. ప్ర‌శాంత్ చంద్ర మాట్లాడుతూ, “వ‌ర్షాకాలం కావ‌డంతో పాటు పారిశుధ్యం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల న‌గ‌రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన వారం రోజులుగా క‌నీసం 40-50% పెరుగుద‌ల ఉంద‌ని మేం గ‌మ‌నించాము. సాయంత్రం త‌ర్వాత‌, తెల్ల‌వారుజామున డెంగ్యూకార‌క దోమ‌లు బాగా చురుగ్గా ఉంటాయి. ఈ స‌మ‌యంలో వాకింగ్ కోసం వెళ్లేవారు పారిశుధ్య ప‌రిస్థితులు స‌రిగా లేనిచోట ఉంటే వీటి కాటుకు గుర‌వుతారు. శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పి ఉంచే దుస్తులు ధ‌రించ‌డం, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం, నీళ్లు నిల్వ ఉన్న‌చోట న‌డ‌వ‌కుండా ఉండ‌టం లాంటి చ‌ర్య‌ల‌తో డెంగ్యూను నివారించ‌వ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన‌వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా ప‌రీక్ష చేయించుకుని ముప్పును అంచ‌నా వేసుకోవ‌డం చాలా ముఖ్యం” అని డాక్ట‌ర్ ప్ర‌శాంత్ చంద్ర వివ‌రించారు.

“ల‌క్డీకాపుల్ లోని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి డెంగ్యూ జ్వ‌రాలపై అవ‌గాహ‌న క‌లిగించేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంది. డెంగ్యూ జ్వ‌రాలు పెర‌గ‌డం వ‌ల్ల వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. వ‌ర్షాకాలంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాం. ప్ర‌స్తుత కొవిడ్‌-19 ప‌రిస్థితుల్లో ఇలాంటి సీజ‌న‌ల్ వ్యాధుల ప్ర‌భావం మ‌రింత సంక్లిష్టంగా మారే ప్ర‌మాద‌ముంది” అని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ల‌క్డీకాపుల్‌) సీఈవో గౌర‌వ్ ఖురానా తెలిపారు.

గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి గురించి:
హైద‌రాబాద్ ల‌క్డీకాపుల్ ప్రాంతంలోని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి భార‌త‌దేశంలోని టెర్షియ‌రీ కేర్ మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రుల్లో అత్యుత్త‌మ‌మైన‌ది. గ‌డిచిన 20 ఏళ్లుగా అవ‌వ‌య మార్పిడి విష‌యంలో మ‌ధ్య, తూర్పు భార‌త‌దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆసుప‌త్రికి ఎన్ఏబీఎల్‌, ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉంది. 150 ప‌డ‌క‌ల‌తో ప్ర‌తియేటా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా, విద‌ర్భ, మ‌రాఠ్వాడా ప్రాంతాల‌కు చెందిన ల‌క్ష‌ల మంది పేషెంట్ల‌కు సేవ‌లు అందిస్తోంది.

ఈ ఆసుప‌త్రికి అన్ని ప్ర‌ధాన ఆరోగ్య‌బీమా సంస్థ‌ల‌తో ఒప్పందం ఉంది, హైద‌రాబాద్‌లోని అన్ని కార్పొరేట్ సంస్థ‌ల‌లో ఎంప్యాన‌ల్ అయింది. అడ్మిష‌న్ల‌కు ముందు, త‌ర్వాత అవ‌స‌ర‌మైన సేవ‌ల కోసం భార‌త్‌తో పాటు సార్క్ దేశాల పేషెంట్ల‌కు వీడియో క‌న్స‌ల్టేష‌న్ సేవ‌లను కూడా అందిస్తోంది.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడ‌ర్ అయిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌లో గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుపత్రి ఒక భాగం. అన్ని విభాగాల‌లో పూర్తిస్థాయి సేవ‌లు, నిబ‌ద్ధ‌త క‌లిగిన సిబ్బంది, అందరికీ అందుబాటులో ఉండ‌టం, నాణ్య‌త‌కు, భ‌ద్ర‌త‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టంతో ఐహెచ్‌హెచ్ ప్ర‌పంచంలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన హెల్త్‌కేర్ స‌ర్వీసుగా నిలిచింది. జీవితాల‌ను స్పృశించి, చికిత్స‌ల‌ను సంపూర్ణంగా మార్చాల‌న్న ఏకైక ధ్యేయంతో ఈ నెట్‌వ‌ర్క్‌లోని ఆసుప‌త్రుల‌న్నీ క‌లిశాయి. గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుపత్రి గురించి మ‌రిన్ని వివ‌రాల‌కు చూడండి https://www.gleneaglesglobalhospitals.com/

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article