చంద్రబాబు కుప్పం పర్యటన: హై టెన్షన్

108
High Tension At Kuppam Over Flexy Issue
High Tension At Kuppam Over Flexy Issue

High Tension At Kuppam Over Flexy Issue

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ- టీడీపీ మధ్య రగడ జరుగుతోంది. 15 రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే పర్యటన ముగిసినప్పటికీ బ్యానర్ల తొలగింపునకు మాములుగా ఎవరిదైనా పర్యటన ఉంటే ఒకటి రెండు రోజులు ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుని తీసేస్తారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం పెద్దిరెడ్డి వచ్చి 15రోజులు అయినా ఇప్పటివరకూ బ్యానర్లు తొలగించలేదు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ మున్సిపల్ కమిషనర్‌ కు  టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రేపు, ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులను బ్యానర్లు తొలగించాలని కోరారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క బ్యానర్ కూడా తొలగించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకపక్క వైసీపీ నేతపై హత్యకు కుట్ర చేశారని అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపధ్యంలో రేపు చంద్రబాబు పర్యటనలో ఏం జరుగుతుందో ఏమో..? అనే టెన్షన్ నెలకొంది.

High Tension At Kuppam Over Flexy Issue,chandrababu , kuppam ,ycp, tdp, banners, felx, ycp leader, murder ,sketch , chandrababu visit ,tension

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here