High tension at Shadnagar
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులని కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు నిందితులకు వ్యతిరేకంగా జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో ర్యాలీలు చేస్తున్నారు గ్రామస్థులు. ఏకకంఠంతో నిందితులను శిక్షించమంటున్నారు ఆ గ్రామ స్థానికులు. ఇక మక్తల్ మండల ప్రజలు కూడా ఆ రాక్షసుల్ని ఉరి తియ్యాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు నిందితులకు న్యాయ సహాయం అందించమంటున్నారు షాద్ నగర్ బార్ అసోసియేషన్ యాజమాన్యం. అయితే ప్రియాంక హత్య కేసులో ప్రధాన నిందితుల్ని కోర్టుకు తరలించే క్రమంలో అక్కడి ప్రజలు వాళ్ళని మాకు వదిలెయ్యండంటూ పోలీసుల్ని అడ్డుకుంటున్నారు. ఇక షాద్‌నగర్ పీఎస్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా.. నిందితులను మహబూబ్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌కు తరలించేందుకు జాప్యం జరుగుతుంది.