డిసెంబర్ 3 దాకా ధరణి పోర్టల్ పై స్టే

HighCourt Stay On Dharani

డిసెంబర్ 3 వరకు ధరణి పోర్టల్ పైన స్టే యధావిధిగా కొనసాగుతుంది. ధరణి పోర్టల్ లో డేటా మిస్ యూజ్ చేస్తే ఎవరు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆధార్ కార్డు సమాచారం రెండు సార్లు లీక్ అయిన కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టు ఏమి చేయలేక పోయిందని తెలిపింది. ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు విచారించింది. ఆధార్ కార్డు వివరాలు కావాల్సివస్తే ప్రభుత్వం, ఆధార్ కార్డు డివిజన్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్న పిటీషనర్ తరపు న్యాయవాది. ప్రభుత్వ కౌంటర్లో హైకోర్టు అడిగిన వివరాలకు సమాధానం లేదని.. ఆధార్ వివరాలను షేర్ చేయాలంటే జ్యూడిషల్ పర్మిషన్ కావాలన్న పిటీషనర్ న్యాయవాది.

డేటా ఎవరు కాపాడుతారు?
డేటా ఎక్కడ పెడుతారు?
డేటా ఎందుకు కావాలి?
ఆ డేటా ఎవరికీ కావాలి?
డేటా ఏ పద్దతి లో స్టోర్ చేస్తారో పిటీషన్ న్యాయవాది తెలిపారు. ఇంట్లో ఉన్న వారి వ్యక్తిగత వివరాలు ఎందుకు అని.. రేపు పోలీసులు కూడా ఇంటికి వచ్చి నా వివరాలు అడిగితే? అది చట్ట విరోధమని, వివరాలు కోరడం చట్ట పరిమితి, కావాలన్న పిటీషనర్ న్యాయవాది. అయితే, ఆధార్ కు చట్టబద్దత ధరణిలో లేదన్న సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి. ఆర్టికల్ 300A, ప్రకారం ధరణి లో నమోదు చేసుకోకపోతే, ప్రాపర్టీస్ ట్రాన్స్ ఫర్, అమ్మడం, నిషేధించడం చట్ట విరుద్ధమన్నారు.

ధరణి సవరణ యాక్ట్ ప్రకారం రికార్డు అఫ్ రైట్స్ ఎక్కడ నిర్వచించలేదని న్యాయవాది వాదించగా, ప్రభుత్వం కౌంటర్ లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని అడ్వకేట్ అన్నారు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఎన్యూమరేషన్ ప్రొవిజన్ లేదన్న అడ్వకేట్. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కి పాస్ బుక్ ఇవ్వడం ఏ చట్టంలో కూడా లేదని, నా ఆస్తిని నేనమ్ముకునాలంటే నా వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని ఏ చట్టంలో లేదని, నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కి పాస్ బుక్ ఇవ్వడం ఏ చట్టంలో కూడా లేదని పిటీషనర్ అడ్వకేట్ తెలిపారు.

రూరల్ ఏరియాలో 97% ఆస్తుల వివరాలు నమోదు పూర్తి అయిపోయిందన్న అడ్వొకేట్ జనరల్. మున్సిపాలిటీ లో 87% పూర్తి అయిందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ లో ఈ విషయం ప్రస్తావించలేదన్న పిటీషనర్ అడ్వకేట్, ధరణి పోర్టల్ పై ప్రభుత్వం పారదర్శకంగా లేదన్నారు. Ghmc పరిధిలో 16.60 లక్షల ఉంటే అందులో 2.90 లక్షల మంది ఆస్తుల నమోదు చేసుకున్నారన్న అడ్వకేట్ జనరల్ అన్నారు. 30000 అగ్రికల్చర్ లావాదేవీలు నమోదు అయ్యాయని తెలిపారు.  ధరణి లో రిజిస్ట్రేషన్ చేసుకపోతే దాని పరిణామం ప్రజలే భరించాలన్న ప్రభుత్వం.

Dharani High Court Update

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article