హిట్ కొట్టాలంటే ఎక్స్ పర్మెంటే కరెక్టా ..?

75
telugu cinema
telugu cinema

hit formula

కమర్షియల్ స్టార్స్ ప్రయోగాలు చేయడం అనేది స్క్రిప్ట్ మీద సాములాంటిది. అది ఆడియన్స్ కు ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పలేం. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఊహించలేరు. అందుకే సాధ్యమైనంతగా ప్రయోగాలకు దూరంగా ఉంటారు కమర్షియల్ స్టార్స్. కానీ ఒక్కోసారి భలే క్లిక్ అవుతుంటాయి. ఇలాంటివి చూసే మరింతమంది ఎక్స్ పర్మెంట్స్ కు యస్ చెబుతుంటారు. అయితే ఇది కేవలం హీరోలకే కాదు.. హీరోయిన్లకూ వర్తిస్తుంది. అందుకే ప్రస్తుతం  టాలీవుడ్ లో ప్రయోగాలు పెరుగుతున్నాయి. అందులో అందగత్తెలూ చేరుతున్నారు.
అల వైకుంఠపురములో కంటే ముందు నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా రంగస్థలం. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో చరణ్ బధిరుడుగా నటించాడు. సినిమా అంతా చెవులు వినిపించవు. చివర్లో మెషీన్ పెట్టుకుంటాడు. కానీ ఆ లోపం అలాగే ఉంటుంది. ఓ కమర్షియల్ హీరోగా చరణ్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అలాంటి తను ఇలాంటి పాత్ర చేయడం రిస్క్. కానీ స్క్రిప్ట్ ను నమ్మాడు హిట్ అందుకున్నాడు.

తర్వాత మాస్ హీరోగా తిరుగులేని స్టార్డమ్ ఉన్న ఎన్టీఆర్ సైతం.. ఇలాంటి ఎక్స్ పర్మెంట్ తో అదరగొట్టాడు. జై లవకుశ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు చేశాడు. ఓ రకంగా త్రిపాత్రాభినయమే ఓ ప్రయోగం. అందులో ఓ పాత్రకు నత్తి ఉంటుంది. డైలాగ్స్ చెప్పడంలో తన తర్వాతే ఎవరైనా అన్న ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీవోడు.. ఇలా నత్తి పాత్రలో నటించడం ఖచ్చితంగా ఎక్స్ పర్మెంటే. అందులో అతను సూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమా కూడా హిట్ అందుకుంది. రవితేజ సైతం అంధుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. రాజా ది గ్రేట్ అంటూ వచ్చిన సినిమాలో అతను అంధుడుగా కనిపించాడు. కాకపోతే ఇది ప్రయోగం అని చెప్పేందుకు వీలు లేకుండా కంప్లీట్ ఎంటర్టైనర్ గా మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయినా హీరోకు కళ్లు కనిపించవు అనేది స్క్రిప్ట్ మేరకు ప్రయోగం అనే చెప్పాలేమో. కాకపోతే కళ్లు కనిపించవు అన్నమాటే కానీ.. హీరో అంతకు ముందు సినిమాల్లా అన్నీ చేసేస్తుండటం కొంత అతిశయోక్తి అనే చెప్పాలి. ఇక టాప్ హీరోయిన్ సమంత సైతం ఇలాంటి ఓ ప్రయోగంతో మెప్పించింది.

నందినీ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఓ బేబీలో ఇలాంటి ఓ ఎక్స్ పర్మెంట్ తోనే మెప్పించింది. కథ ప్రకారం వయసు మళ్లిన మహిళ.. యవ్వన దశలోకి వస్తుంది. మనసు 60ల్లోదే అయినా శరీరం 20ల్లో ఉంటుంది. ప్రయోగాత్మకమైన ఈ వైరుధ్యాన్ని అద్భుతంగా నటించింది సమంత. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా కూడా ప్రయోగమే. సినిమాలో అనుష్క మూగ, చెవిటి మహిళ పాత్రలో నటిస్తోంది. అనుష్క లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటి ఇలాంటి పాత్ర చేయడం పెద్ద ఛాలెంజేం కాదు. కానీ కమర్షియల్ గా చూస్తే రిస్కే. కథ బలంగా ఉండి.. కంటెంట్ ఆకట్టుకుంటే కమర్షియల్ గానూ మంచి విజయమే సాధిస్తుంది. అనుష్కతో పాటు ప్రస్తుతం శ్రియ కూడా ఇలాంటి ప్రయోగంతోనే కొత్త గమనం మొదలుపెట్టింది. పైగా ఇది కూడా ప్యాన్ ఇండియన్ సినిమా. రీసెంట్ గా అనౌన్స్ అయిన గమనం సినిమాలో శ్రియకు చెవులు వినిపించవు అంటున్నారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందుకు తగ్గట్టుగానే కనిపిస్తోంది. సగటు మహిళగా మరీ ఎక్కువ మేకప్పేం లేకుండా శ్రియ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా నిశ్శబ్ధంతో పాటు గమనం కూడా కమర్షియల్ గా విజయాలు సాధిస్తే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఎక్స్ పర్మెంటల్ కథలకు తెలుగులో మంచి డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here