హిట్…హిట్ కొట్టడం గ్యారెంటీ

98
viswak new movie
viswak new movie
HIT Movie Trailer Talk
ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. కుర్రాడిలో టాలెంట్ ఉంది అని అంతా చెబుతుంటారు. కాకపోతే కమర్షియల్ విజయాలు అందుకుంటేనే స్టార్డమ్ వస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా అతని టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అతని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ పై విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్’ అనే సినిమా నిర్మిచాడు నాని. శైలేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతోన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. రింగ్ రోడ్ లో మిస్ అయిన ఓ అమ్మాయిన వెదుకుతూ వెళ్లే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ నటించాడని తెలుస్తోంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఊహించని మలుపులు ఉండబోతున్నాయి. అందుకే ఇది థ్రిల్లర్ సినిమా అయింది. రెగ్యులర్ త్రిల్లర్ కు భిన్నంగా తమ సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. అది నిజమే అనిపిస్తోంది ట్రైలర్.  రుహానీ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ థ్రిల్లర్ తో విశ్వక్ సేన్ పెద్ద హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. మొత్తంగా ఈ నెల 28నే విడుదల కాబోతోందీ చిత్రం. విశ్వక్ తో పాటు నాని కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాకు బజ్ పెరుగుతుంది. వాళ్లు చెప్పినట్టు నిజంగానే బావుంటే మైలేజ్ కూడా వస్తుంది. మొత్తంగా ఈ హిట్.. హిట్ అయ్యేలానే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here