హిట్ జంట రిపీట్‌

HIT Pair Repeat
బెల్లంకొండ శ్రీనివాస్.. జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే, వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. త‌దుప‌రి సినిమా కోసం కండ‌లు కూడా పెంచేస్తున్నాడండోయ్‌. కాగా ఈ కుర్ర హీరో లిస్టులో ఉన్న సినిమాల్లో డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి సినిమా కూడా ఒక‌టి. `ఆర్‌.ఎక్స్ 100` త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న సినిమా కోసం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో స‌మంత‌ను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌నుకుంటుంది చిత్ర యూనిట్‌. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం `అల్లుడుశీను` లో స‌మంత‌నే హీరోయ‌న్‌. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే త‌న తొలి సినిమా హీరోయిన్‌తో బెల్లంకొండ న‌టించే అవ‌కాశం ఉంది.
Subscribe to YT|Tsnews.tv
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article