హైటెక్ సిటీ అండర్ బ్రిడ్జి ఆరంభం

54
Inauguration of Railway Under Bridge (RUB) at HiTech City Railway Station, Kukatpally
Inauguration of Railway Under Bridge (RUB) at HiTech City Railway Station, Kukatpally

Hitech City Bridge Started

హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్.ఆర్.డి.పి) లో చేపట్టిన మరో ప్రాజెక్టు నగర వాసులకు అందు బాటులో రానుంది. తాజాగా రూ.66 .59 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన హై-టెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి ని నగర పౌరులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం అంకితం చేయనున్నారు. ఇప్పటికే దాదాపు రూ.1010 కోట్ల పైగా వ్యయంతో చేపట్టిన 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులో వచ్చాయి. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హై-టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఎస్.ఆర్.డి.పి మొదటి దశలో గచ్చిబౌలి నుండి జె.ఎన్ టి,యు వరకు చేపట్టిన ఫ్లయ్ ఓవర్లు, అండర్ పాస్ లైన బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జుంక్షన్స్ ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో వీటి ఫలాలను నగరవాసులు ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తూ ఫలితాలను పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో హై -టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు కానుంది.

ఈ ఆర్.యు.బి నిర్మాణానికి ముందు ఈ బ్రిడ్జి క్రింద ప్రతి రోజూ 35 వెళ్లనుంది 40 వేల లీటర్ల నీరు ఊరేది. ఈ నీటితో అండర్ బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. ఇక, భారీ వర్షాలు పడితే అక్కడి పరిస్థితులు వర్ణనాతీతంగా ఉండేవి. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయడానికి సమీపంలో పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట్ సర్కిల్ లో నాటిన హరిత హారం మొక్కలకు నీరందిస్తున్నారు. మొత్తానికి, ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ ఆర్.యు.బి నిర్మాణంతో తీరుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Hitech Bridge Start

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here