హెచ్ఎండీఏ డ‌బ్బు చెల్లించాల్సిందే

70
HMDA must return money
HMDA must return money

HMDA must return money

ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుల‌ను హెచ్ ఎండీఏ తిరస్క‌రించ‌డంతో తాము చెల్లించిన సొమ్మును వెన‌క్కి ఇవ్వాల‌ని ప‌లువురు ప్లాటు ఓన‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం 2016లో ఎల్ఆర్ఎస్ పథ‌కాన్ని ప్రారంభించింది. ప్లాటు ఓన‌ర్లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప‌లుసార్లు ఎల్ఆర్ఎస్‌ను పొడిగించింది. దాదాపు 1.75 లక్ష‌ల ద‌ర‌ఖాస్తులు రాగా.. అందులో ఇర‌వై వేల ద‌ర‌ఖాస్తుల్ని హెచ్ఎండీఏ తిర‌స్క‌రించింది. కొన్ని ప్లాట్లు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉండ‌టం, మ‌రికొన్ని దేవాదాయ శాఖ ప‌రిధిలోకి రావ‌డం, ఇంకొన్ని ఇత‌ర ప‌రిధిలో ఉండ‌టంతో వివాదాలు నెల‌కొన్నాయి. ఇలా సుమారు ఇర‌వై వేల ప్లాట్ల‌ను హెచ్ఎండీఏ తిరస్క‌రించింది. ప్ర‌తి ద‌ర‌ఖాస్తుకు ఒక్కొక్క‌రు సుమారు రూ.10,000 చెల్లించారు. త‌మ సొమ్మును వెన‌క్కి ఇచ్చేయాల‌ని ప్లాటు ఓన‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, హెచ్ఎండీఏ మాత్రం తాము సొమ్ము చెల్లించ‌లేమ‌ని అంటున్నాయి.

 

hmda latest updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here